

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ బడ్నాయక వలస లో గ్రామ సందర్శనలో భాగంగా శుక్రవారం నాడు ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ద్రవ జీవామృతం తయారీ జరిగింది.రైతు ఆడారి ప్రదీప్ పొలం లో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారీలో మండల స్పెషల్ ఆఫీసర్ వి రాధకృష్ణ పాల్గొన్నారు.ఆ గ్రామంలో పెరటి తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ద్రవ జీవామృతం వేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన దిగుబడులు పొందవచ్చని ఏ ఓ కే తిరుపతి రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వ్యవసాయ అధికారి ప్రకృతి సేద్య సిబ్బంది పాల్గొన్నారు.