యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న 100 డేస్ ప్రోగ్రామ్లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ పి. చంద్ర, డిప్యూటీ ఎంపీడీవో (జీసిడబ్ల్యూఎస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొటాలం ను సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలని, పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు అందరూ సమయానికి హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ఆయన అడిగిన ప్రశ్నలకు చురుకుగా సమాధానాలు ఇవ్వడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లాలో మంచి స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొటాలం నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం సూచించిన టైమ్ టేబుల్ మరియు ప్రణాళికను చివరి వరకు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యూసుఫ్, ఉపాధ్యాయులు వెంకటరమణ, అమరేంద్ర, ధనశేఖర్, రాణి, కలైవాణి, లీలారాణి పాల్గొన్నారు.