యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 ‎ప్రాంతీయ సంచాలకులు (ఆర్.జె.డి) డి. శ్యాముల్ యాదమరి మండలాన్ని సందర్శించి కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న వంద రోజుల కార్యక్రమం నిర్వహణ, బోధనా విధానాలు, విద్యార్థుల ప్రగతిని సమీక్షించారు. కళాశాల స్థాయి విద్యార్థులతో పరస్పరం మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయ బృందంతో సమావేశమై విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు హెచ్.యం–కమ్–ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత తెలిపారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఎల్.ఎస్. ప్రసాద్, ఎస్.ఎస్.ఎ. సెక్టోరియల్ అధికారి మధు తదితరులు ఆర్.జె.డితో పాటు పాల్గొన్నారు. అలాగే భూమిరెడ్డిపల్లె స్వచ్ఛత ప్రాథమిక పాఠశాలనూ సందర్శించి అక్కడి విద్యా వసతులు, పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాభివృద్ధి దిశగా సమిష్టి కృషితో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆర్.జె.డి ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *