‎గంగాధర నెల్లూరు, మన ధ్యాస నవంబర్-14: ఎస్టియు గంగాధర నెల్లూరు మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సి. కోటి, ప్రధాన కార్యదర్శిగా టి. పెద్దబ్బ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా కె. పరంధాం నాయుడు, మహిళా కన్వీనర్‌గా చంద్రిక బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికైన నాయకులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సేవలో ఉన్న ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ వ్యవస్థను అమలు చేయాలని, జీతాల సవరణ కమిషన్‌ను నియమించి మద్యంతర భృతిని 30 శాతం తగ్గకుండా ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ కన్వీనర్ దేవరాజుల రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి సేవా నిబంధనలు అమలు చేసి సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు అర్హతల మేరకు పదోన్నతులు ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం పథకం కింద బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు సరఫరా చేయాలని, ఖాళీగా ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రన్, ఎస్టియు నాయకులు కమలాపతి, ఢిల్లీ ప్రకాష్, విజయ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, నరసింహులు, ప్రహసిత్, భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *