తవణంపల్లి మే 17 మన ద్యాస ప్రతినిధి మే 16 (నాగరాజ సరకింటి)

తవణంపల్లి మండలంలోని అరగొండ గ్రామానికి చెందిన, నేటికీ సామాజిక సేవలో ప్రజల మన్ననలు పొందిన అరగొండ రాజేశ్వరమ్మను గుర్తించి భారత్ విరుచువల్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ మరియు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని మాటలలో కొందరు ప్రజల సేవే మార్గంగా.. తమ ఉదారతను చాటుకుంటారు… సమాజసేవే లక్ష్యంగా బతుకుతుంటారు.. సరిగ్గా అదే కోవకు చెందినవారు అరగొండ రాజేశ్వరమ్మ. పరులకు ఉపకారం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు… కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. కదా…. అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. అరగొండ గ్రామానికి చెందిన రాజేశ్వరమ్మ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు అడగకముందే సాయంమందిస్తూ వాడ వాడలోనూ.. వీధి వీధిలోను.. వేలాది మందికి తన వంతు సాయం అందిస్తున్నారామే.. ఎటువంటి లాభాన్ని ఆశించకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాజేశ్వరమ్మ. అరగొండ గ్రామంలో స్థిర నివాసం కలిగిన ఆమె కరోనా కష్టకాలంలో ఆమె ఏమాత్రం భయపడలేదు.. కోవిడ్..19 నిబంధనలు పాటిస్తూ ప్రజల మధ్యనే తిరుగుతూ వారికి అండగా నిలిచారు. ఆమె వేలాది మందికి ఆకలి తీర్చడమే కాకుండా ఆర్థిక సాయం చేస్తూ, ఆమెను జనం ప్రేమగా రాజేశ్వరక్క అంటూ పిలుచుకునే రాజేశ్వరమ్మ ఎంతో కాలంగా అరగొండ ప్రాంతంలో ఎవరికి ఏం కావాలన్నా తన స్థాయికి తగినట్లు సాయం అందిస్తున్నారు. వ్యవసాయం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు సామాన్య ప్రజలు పడే కష్టాలను చాలా బాగా అర్థం చేసుకోగలరు. అందుకోసమే తన వంతు సహాయంగా ప్రజలకు ఏదో ఒక విధంగా సాయపడాలనే సదుద్దేశంతో పరులకు ఉపకారం చేస్తున్నారు. స్థానికంగా మహిళ నాయకురాలుగా గుర్తింపు పొంది రాజకీయ రంగంలో, సామాజిక సేవలో, ఎన్నో ఏళ్లుగా చుట్టూ ప్రక్కల గ్రామాలలో ఎంతోమంది పేదవారికి అండగా నిలిచి, భరోసనిస్తూ సేవే పరమావధిగా భావిస్తూ ముందుకు వెళుతుంటారు రాజేశ్వరమ్మ. చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజల మన్ననలు పొంది నేటి సమాజంలో మంచి వ్యక్తిత్వం గుర్తింపు పొందిన మహిళ నాయకురాలుగా ఎదుగుతూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ, సామాజిక సేవలో ముందుంటూ సేవే పరమావధిగా భావిస్తున్న ఆమెను భారత్ విరుచువల్ యూనివర్సిటీ ఆమెకు సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టరేట్ అందుకున్న అరగొండ రాజేశ్వరమ్మ ను మండలంలోని పలువురు ఆమెకు అభినందనలు ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *