

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి అధికారి ( ఏడిఏ) నిర్మల మేడం రైతులకు, కౌలుదారులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా పంటల దిగుబడిని పెంచుకునే విధంగా ఎరువులను సరైన మోతాదులో వాడుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు.కార్యక్రమం అనంతరం అధికారులు రైతులతో కలిసి స్థానిక మామిడి తోటను సందర్శించి పలు సాంకేతిక అంశాలను వివరిస్తూ రైతులకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పాత సింగరాయకొండ రైతులతో పాటు ఎంఏఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ అస్మ, వి ఏ ఏ లక్ష్మీ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు.