

- ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం చెక్కులు పంపిణీ…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియ శీలక సభ్యత్వం ఆసరాగా నిలుస్తుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన ప్రత్తిపాడు నియోజకవర్గం నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) ఆధ్వర్యంలో జనసేన క్రియసీలక సభ్యత్వం నమోదు చేసుకుని ప్రమాదం సాతు మరణించిన వారికి మంగళవారం 5 లక్షలతో కూడిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మాట్లాడుతూ,ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శృంగధార మనుగుల శివశంకర్, ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి తర్రా దుర్గ పవన్, పెద శంకర్లపూడి అంకం సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోగా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ చెక్ లను క్రియా వాలంటీర్ ద్వారా భాదిత కుటుంబాలకు అందజేయడం జరిగిందని అన్నారు.అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) మాట్లాడుతూ, ప్రమాదాలకు లోనై కుటుంబ భారాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న భాదితులకు ఎంతో క్రియేసీలక సభ్యత్వం ఎంతో ఊరట ఇచ్చి బతుకు దారి చూపించే ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ సభ్యత్వం తోనే నిరుపేద కుటుంబాల భరోసాని ఇస్తుందన్నారు. క్రియ శ్రీలత సభ్యత్వాల నమోదు వాలెంటీర్లు ధళే జ్యోతి, శీరం శ్రీను, కొరుప్రోలు రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లా మహిళా రీజనల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మీ, జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు లింగంపర్తి (పిఎసిఎస్) ఛైర్మన్ పెంటకోట మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి ధర్మవరం పిఎసిఎస్ ఛైర్మన్ దాసం శేషారావు, ప్రత్తిపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రామకుర్తి కామేష్, శంఖవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గండిరెడ్ల మణికంఠ, ఉపాధ్యక్షులు అచ్చే వీరబాబు, పలివెల వెంకటేష్ రౌతులపూడి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు షేక్ సలీమ్, తంటపురెడ్డి జయగంట కత్తిపూడి పిఎసిఎస్ డైరెక్టర్ శరణం జయబాబు, కత్తిపూడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పోసిన శ్రీను శంఖవరం మండల మహిళ నాయకురాలు జర్త సరస్వతి, జర్త లక్ష్మణ్, గొంది కొత్తపల్లి జనసేన పార్టీ నాయకులు కోన సతీష్, శ్రీను, తలపంటి వీరబాబు, గౌతు బుజ్జి, కండిపల్లి ప్రవీణ్, ప్రత్తిపాడు మండల నాయకులు రెడ్డిపల్లి మధు, కుప్పిన శ్రీను, శీరం సురేష్, బెండ నానాజి, చిన శంకర్లపూడి గ్రామ నాయకులు కర్రి వీరబాబు రౌతుపాలెం గ్రామ నాయకులు రాము, సత్తిబాబు, పొదురుపాక గణేష్, ఏలేశ్వరం మండల నాయకులు పొట్ట సత్యనారాయణ, మాగాపు వీరబాబు, లింగంపర్తి నాని, ఒమ్మంగి గ్రామ నాయకులు రవి తదితర నాయకులు భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.