

మన ధ్యాస సింగరాయకొండ
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలోని దక్షిణ సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా శనివారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధన పూజ, అకల్మష హోమం, స్నాపన తిరువంజనం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి.