

మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆత్మకూర్ ఆగస్టు 30 ////
ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం అప్పసముద్రం లో వినాయకుని నిమజ్జనం రోజున శుక్రవారం జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వినాయకుని నిమజ్జనం లో చోటు చేసుకున్న సంఘటన ఎమ్మెల్యేని కలిసి వేసింది. బాణా సంచాలు పేలి తొమ్మిది మంది చిన్నారుకు ఒళ్ళు కాలి క్షతగాత్రులుగా మారారు. వారి బాధ వర్ణనాతీతం. వారిని చూసి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తీవ్ర ఆవేదన చెందారు. వింజమూరులోని షఫీ హాస్పిటల్ లో ముగ్గురు చికిత్స పొందు చుండగా మరో ఆరు మంది ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆత్మకూరులో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే నెల్లూరుకు పంపించాలని వైద్య ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి వింజమూర్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి వైద్య ఖర్చుల నిమిత్తం, ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30,000 ఆర్థిక సహాయం అందజేశారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు.