

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
*31వ తేదీ అనగా (రేపు) గురువారం రోజు జరిగే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో కలిగిరి మండలం నుండి జన సమీకరణకు అనుమతి లేదని కలిగిరి ఎస్సై ఎంమ్ ఉమశంకర్ తెలిపారు.అదేవిదంగా కలిగిరి
మండలంలోని వైసీపీ నాయకులు ఎవరైనా జన సమీకరణ చేసినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు.అదేవిధంగా
వాహనాలలతో ర్యాలీగా వెళ్ళడం కానీ ఆటోలలో జనాలను తరలించడం,కానీ గుంపులు గుంపులుగా పోవటం లాంటి కార్యక్రమాలు చేయరాదని తెలిపారు.అలా ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. మండలంలోని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై ఉమాశంకర్ తెలియజేశారు.