

వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండడంతో మండలం నుండి జన సమీకరణ కు అనుమతులేదని వింజమూరు ఎస్సై కె వీర ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వైసీపీ నాయకులు ఎవరైనా జన సమీకరణ చేసిన,రెచ్చగొట్టే వాక్యాలు చేసినా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన,తగు చర్యలు తీసుకోవడం తద్యంఅన్నారు. వాహనాలతో ర్యాలీగా వెళ్లడం, ఆటోలలో జనాలను తరలించడం, గుంపులు గుంపులుగా పోవడం లాంటి కార్యక్రమాలు చేయరాదన్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిరక్షణ దిశగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రతి ఒక్కరూ సూచ తప్పకుండా పాటించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే నిబంధనను అధిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కనుక మండలంలోని ప్రజలందరూ పోలీస్ రహరించాలని ఎస్సై వీర ప్రతాప్ కోరారు.