ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి..

కావలి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

కావలి నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు రూ. 71,66,072 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అందజేశారు. శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నీడన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి, పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని, సొంత నిధులు వెచ్చించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని, ముఖ్యంగా వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటివరకు 534 మంది లబ్ధిదారులకు రూ. 5,11, 84,072 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు కస్టపడి పనిచేస్తున్నారని తెలిపారు.

  • Related Posts

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కలిగిరి :(మన ద్యాసన్యూస్):ప్రతినిధి, నాగరాజు :/// ఆంధ్రప్రదశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా అమరావతిలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.నేపాల్ లో చిక్కుకున్న 215 మంది తెలుగు వారిని క్షేమంగా ప్రత్యేక విమానాల్లో…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    ఆంధ్రప్రదేశ్ : (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు :///// కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం… ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు