కావలి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

కావలి నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు రూ. 71,66,072 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అందజేశారు. శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నీడన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి, పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని, సొంత నిధులు వెచ్చించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని, ముఖ్యంగా వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటివరకు 534 మంది లబ్ధిదారులకు రూ. 5,11, 84,072 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు కస్టపడి పనిచేస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *