

మన న్యూస్, వెదురుకుప్పం:– ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా బొమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ చొక్కా గోవిందయ్య ని పార్టీ నేడు నియమించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించిన గోవిందయ్య సేవలను గుర్తించిన పార్టీ, ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గోవిందయ్య మాట్లాడుతూ –“ఈ పదవి నాకు కలగడానికి కృషి చేసిన నా ఆరాధ్యదైవం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కి, అలాగే నా సోదరి, వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వైఎస్ఆర్సిపి సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.