

డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులకు ఘన సన్మానం
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : సమాజంలో సమర్థులైన వైద్యులు ఎందరో ఉంటారని,వారిలో సేవాభావం కలిగిన వైద్యులు కొందరే ఉంటా రని, సమర్ధత, సేవా భావం రెండూ ఉన్న వైద్యులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చల్లని చూపుతో నిరు పేదలకు 24 గంటల పాటు వైద్య సేవలను అందించడం ఏజెన్సీ ప్రాంత ప్రజలఅదృష్టమని,ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవా ది కర్నె రవి అన్నారు.డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి సూపరిండెంట్ సునీల్ మంజేకర్, ఆర్ఏంఓ లు డాక్టర్. సాయి మోహన్, డాక్టర్. ఎం. గౌరీ ప్రసాద్, వైద్యులు శ్రీదేవి, ప్రేమ్ రెడ్డి, పద్మ, పావని, ప్రసాద్, నిఖి ల్, కృష్ణ శ్రీ, స్వాతి లను తెలంగా ణ ఉద్యమకారుడు వలసాల వెంకట రామారావు, నరేందర్ తో కలసి ఘనంగా సత్కరించి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ..ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యుల సేవలను ప్రజలు మరచిపోరని ప్రశంసించారు. డబ్బులకంటే సేవే ముఖ్యమనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు తప్పక లభిస్తుందన్నా రు. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాలు నిలబెట్టే సత్తా వైద్యుల కే ఉందన్నారు. వైద్య వృత్తి.. పవిత్రమైంది అని సమాజంలో వైద్యుడంటే ఎంతో గౌరవం ఉందన్నారు. వైద్య వృత్తిని సేవా దృక్పథంతో చేస్తే పేరు ప్రఖ్యాతు లు వస్తాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువ వైద్యుల చేతి లో ఉందని, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఒక్క వైద్యు లకే ఉందన్నారు.అలాంటి వైద్యు లకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సిద్దెల తిరుమలరా వు,వెంక ట్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నా రు.
