గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగులాంబ గద్వాల జిల్లా,కేటీ దొడ్డి మండలం,పాతపాలెం గ్రామంలో ఈనెల 16న జరిగిన బోయ అనిత అనే మహిళ అనుమానస్పద మృతిలో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేసుకు సంబంధించి డీఎస్పీ మొగులయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటిదొడ్డి మండల,పాతపాలెం గ్రామానికి చెందిన అనిత, రంగస్వామి మధ్య గత కొద్దిరోజులుగా అక్రమ సంబంధం నడిచేదని ఈ మధ్య కాలంలో అనిత తీరులో మార్పు గమనించిన రంగస్వామి అనితను అనుమానించి అనిత గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించాడని డిఎస్పీ తెలిపారు. కేటీ దొడ్డి పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టగా రంగస్వామిపై అనుమానం రాగ పోలీసులు రంగస్వామిని విచారించగా అనితను తనే హత్య చేసినట్టు అంగీకరిచ్చినట్టు దీంతో రంగస్వామిని అరెస్ట్ చేసి నేడు రిమాండ్ కు తరలిస్తునట్టు డీఎస్పీ మొగులయ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *