వరికుంటపాడు జూలై 29 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
వరికుంటపాడు మండల టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఆండ్రా బాల గురువారెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆయనను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు బుధవారం వరికుంటపాడులోని వారి నివాసంలో పరామర్శించారు.ఈ సందర్భంగా బాల గురువారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బొల్లినేని వెంకట రామారావు, వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బాల గురువారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఆయన వెంట సుంకర వెంకటాద్రి, సుంకర అంజనాద్రి చంద్ర ఉమామహేశ్వరరావు చంద్ర వెంకయ్య, కామేపల్లి వెంకటరత్నం, కాకి ప్రసాద రావు, పావులూరి రవీంద్ర, గొడుగులూరి మాలకొండ రాయుడు, నూనె ప్రసాద్ గూడూరు రామచంద్రారెడ్డి, స్వర్ణ కొండయ్య తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
