హయత్ నగర్. మన న్యూస్ : హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ కాలనీలో బందారపు లింగస్వామి గౌడ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా భోనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు భూర నరసయ్య గౌడ్ , మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి,పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ తో కలిసి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..ప్రీ స్కూల్లో చిన్నారులకు మానసిక అభివృద్ధితో పాటు ప్రాథమిక జ్ఞానాన్ని నేర్పించేందుకు రూపొందించబడినది. చిన్నవయస్సులోనే శిక్షణ ఇచ్చే విధానం వల్ల పిల్లల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అన్నారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటి ఆధునిక సదుపాయాలతో,మంచి మౌలిక సదుపాయాలు కలిగిన ప్రీ స్కూల్‌ను మా డివిజన్లో ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ ప్లే స్కూల్ మరెన్నో పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాo అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ లావణ్య చంద్ర శేఖర్,జతిన్ ముక్రజి బీజేపీ నాయకులు,కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *