

మన న్యూస్ తవణంపల్లి జూన్-11
మండలంలోని అరగొండ సమీపంలో గల అర్దగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు 11వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు సుదర్శన హోమం సాయంత్రం ప్రకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ప్రతి నెల పౌర్ణమికి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. అని ఆలయ కార్యనిర్వహణ అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి టి హనుమంతరావు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
