

మామిడి రైతులకు క్రషింగ్ రెండవ కర్మాకారాన్ని ఏర్పాటు చేయండి యాజమాన్యానికి టిడిపి నాయకులు వినతి
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణమ నాయుడు ,జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు మండలం లో ఉన్న జైన్ ఫామ్ ఫ్రెష్ సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక స్థానికంగా ఉన్న మామిడి రైతులకు కొనుగోలుకు అవకాశం కల్పించాలని అన్నారు. కూటమీ ప్రభుత్వం కిలోకు నాలుగు రూపాయలు రైతులకు అందిస్తుందని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల నుండి మామిడిని కొనుగోలు చేయాలని అన్నారు. జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆదేశాల మేరకు రెండు రోజుల్లో రెండవ కర్మాగారాన్ని క్రషింగ్ తీసుకురావాలని యాజమాన్యాన్ని టిడిపి నేతలు కోరారు. దీంతో రైతులకు సులభంగా కొనుగోలుకు అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.