మన న్యూస్, నారాయణ పేట జిల్లా: ప్రచార రథం ద్వారా బడిబాట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణ పేట జిల్లా శాఖా కృషిని రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను కింది స్థాయిలో అందరికీ చేర్చాలని, వెనుకబడిన వర్గాలను సైతం విద్య ద్వారా ఉన్నత స్థితికి చేర్చాలని
ఉపాధ్యాయులకు సూచించారు.విభిన్నమైన ఆలోచనతో ప్రభుత్వ బడులకు ప్రవేశాలను పెంచే ప్రయత్నం ఎంతో మెచ్చుకోదగినదని అన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి, నరసింహ,మక్తల్ మండల అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో మంత్రిగారిని పూల మొక్కతో సత్కరించి, నోటు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు గురు రాజారావు, భీమిరెడ్డి, నాగార్జున, రాకేష్, పురుషోత్తం, నర్సిరెడ్డి, వెంకట్రాములు, శివశంకర్, శ్రీనివాస్ రావు, రవీందర్ రెడ్డి, రాజా ఆంజనేయులు, జగదీష్,రామాంజనేయులు, డి రవీందర్ రెడ్డి ,రఘు రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.