

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు జరిగినది ఈ భూభారతి చట్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈ చట్టం ఉద్దేశం ఏమిటంటే పోయిన ప్రభుత్వము ధరణి చట్టం తీసుకురావడం జరిగింది చట్టంలో లోటుపాట్లు ఉన్నావని ప్రజలకు అందుబాటులో ముఖ్యంగా రైతులకు వారి భూమి తగాదాలు చాలా మటుకము పరిష్కారం కాలేదని కొత్త చట్టము ఎమ్మార్వోలకు కలెక్టర్లకు వీరితోనే పని అయిపోయేటట్లు కోర్టులకు వెళ్లకుండా పరిష్కారం చేయడానికి ఈ చట్టం తేవడం అయినది కావున అందరూ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమానికి మానవపాడు మండల రెవెన్యూ అధికారి మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ ఈరోజు జల్లాపురానికి రావడం జరిగినది మరి ఈ కార్యక్రమానికి మాజీ జోగులాంబ దేవాలయం చైర్మన్ జల్లాపురం వెంకటేశ్వర్లు భూభారతి చట్టం గురించి తెలపడం అయినది రైతులకు గ్రామ ప్రజలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
