మన న్యూస్, తిరుపతి:– పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అంతట 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆదివారం ఎటువంటి సభలు సమావేశాలు ఊరేగింపులు నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేయకూడదని, పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *