కలిగిరి ఆగస్టు 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో పెద్దకొండూరు ఎస్సీ కాలనీ నందు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు.ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే సామాజిక పెన్షన్‌ను ₹3,000 నుంచి ₹4,000కు పెంచామని, వికలాంగులకు ₹6,000 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.అలాగే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, పేదల సంక్షేమానికి తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని ఆయన తెలిపారు.గత రెండేళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధికీ పెద్దపీట వేసిన ప్రభుత్వం విజయవాడ ఉదయగిరి నియోజకవర్గ లోఅభివృద్ధికి పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు.ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వసంక్షేమ,కార్యక్రమాలను,వివరిస్తూ,ప్రజలసమస్యలను,నేరుగా,తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు,ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వెల్లంకి కొండప నాయుడు, 258 బూత్ ఇంచార్జీ, మరియు మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, రవీంద్ర, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *