

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో, ఈ రోజు వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి పంచాయతీ తెట్టుగుంటపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంను ఒక్కరోజు ముందుగానే అమలు చేశారు. ఈ కార్యక్రమం కూటమి నాయకుల సమన్వయంతో జరగడం విశేషం. పెన్షన్లు ముందుగా అందడంతో లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, విధవులు ఇలా అనేక లబ్ధిదారులు తమ అభినందనలు తెలిపారు. ఒక లబ్ధిదారుడు మాట్లాడుతూ – “ఇప్పుడే మాకు పెన్షన్ వచ్చింది. మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదొక గొప్ప నిర్ణయం.” అన్నారు. ఈ కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో, స్థానిక నేతల చొరవతో విజయవంతంగా పూర్తయ్యింది. ప్రభుత్వ సంకల్పం, కూటమి నాయకుల సేవా దృక్పథం కలసి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతున్నాయనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్ – నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు , బట్టె చాణిక్య ప్రతాప్ – వాణిజ్య విభాగ అధ్యక్షులు , పాముల శేషాద్రి కుమార్ – బిజెపి ఎస్సీ మోచన్ ప్రధాన కార్యదర్శి , పవన్ & ప్రసాద్ – బూత్ కన్వీనర్లు , సుబ్రహ్మణ్యం – బొమ్మయపల్లి ప్రధాన కార్యదర్శి, ముని వెంకటప్ప, మునిశేఖర్ – గ్రామ నేతలు , యువ నాయకులు – రెడ్డి కుమార్, నాగార్జున, సురేష్, కరుణ శ్రావణ్, అజిత్ రెడ్డి, మహిళా పోలీస్ శ్వేత, అంగన్వాడి టీచర్ విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.