మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30

జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సిపి నాయకులు వెన్నుపోటు దినోత్సవం పేరుతో కార్యక్రమానికి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం బదులు వైఎస్ఆర్సిపి కి పాడే కట్టిన దినోత్సవం పేరుతో కార్యక్రమం నిర్వహించాలని హితవు పలికారు. ఈనెల 27, 28, 29న కడపలో జరిగిన మహానాడును దిగ్విజయం చేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. మహానాడు విజయవంతమైనటువంటి విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు చూసి బెంబేలెత్తిపోయి వెన్నుపోటు దినోత్సవం పేరుతో ప్రజల పైన యుద్ధం ప్రకటించారు. జగన్ అరాచక పాలన నుండి ప్రజలు విసిగి వేసారి పోయి, జగన్ యొక్క నిరంతృత్వం నుండి ఉక్కు కౌగిలి నుండి బయటపడి ప్రజల్ని జగన్ పార్టీనీ 100 అడుగులు గొయ్యి తీసి పాతేసిన రోజు జూన్ 4వ తేదీ.
మీ పార్టీకి పాడే కట్టి, అంత్యక్రియలు చేసి, సమాధి కట్టిన రోజు జూన్ 4వ తేదీన జరుపుకోవాలి. ఇంకా కూడా జగన్ యొక్క విధానంలో మార్పు లేకుండా ప్రజల పైన యుద్ధం ప్రకటించడం దురదృష్టం. ఒకపక్క చంద్రబాబునాయుడు పరిపాలనలో ప్రజలు ఆనందంగా, సుభిక్షంగా, సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేక ప్రజల పైన యుద్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. 4000/- రూపాయల పెన్షన్ , వికలాంగులకు 6000/- పూర్తిస్థాయి అంగవైకల్యం ఉన్నవారికి 15000/- రూపాయలు పెన్షన్, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా తల్లికి వందనం జూన్ 12 నుండి అందించే కార్యక్రమం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే… ఇక వైఎస్ఆర్సిపి పుట్టగతులు ఉండదని ప్రజల పైన యుద్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఉన్న కొద్దిపాటి వైసిపి మూకలను కాపాడుకోవడం కోసం, తన తాడేపల్లి ప్యాలస్ ఒక వంద మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని, చంద్రబాబునాయుడుని తిట్టడమే ఏజెండాగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ పార్టీ పతనమైంది .ఇక జూన్ 4వ తేదీన జరపాల్సింది వైఎస్ఆర్ సీపీకి పార్టీ కట్టిన రోజు జరపాలని తెలుగుదేశం పార్టీ హితవు పలికింది. ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్స్ అధ్యక్షడు మెషాక్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *