కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పలు విషయాలు చర్చించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30: నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పై పెట్టిన ఫాల్స్ కేసును.. న్యాయస్థానాల ద్వారా ఏ విధంగా ఎదుర్కోవాలో గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు రేపు జిల్లాకు విచ్చేస్తున్న విషయాన్ని తెలియజేశారు.అలాగే కాకాణి అక్రమ అరెస్ట్ ను ఖండించేలా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…… స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే గా, మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిపై ఈ విధంగా అక్రమ కేసు పెట్టి వేధించడం ఎన్నడూ చూడలేదని ప్రజాస్వామ్యంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.కూటమి ప్రభుత్వానికి ఈ విధమైన సంస్కృతి మంచిది కాదని హెచ్చరించారు.ఇలాగే ప్రతిపక్ష నేతల అరెస్టులు కొనసాగిస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరైనా బయట తిరగగలరా ఆలోచించుకోవాలన్నారు. ఈ అక్రమ కేసులను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటం చేస్తుందని అన్నారు. ఈ అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేది లేదని రాబోయే రోజుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల గట్టి పోరాటం చేస్తామన్నారు. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని మాకు సూచించారని తెలిపారు.రేపు కాకాణి గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పార్టీ పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లాకు విచ్చేస్తున్నారని తెలిపారు.అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకాణి పూజిత కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నాయకులు కార్యకర్తలను పేరుపేరునా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్, వైసిపి నాయకులు మాజీ ఏ యం సి చైర్మన్ కోటేశ్వర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 11 డివిజన్ ఇంచార్జ్ మహేష్ యాదవ్,42 డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్, వైసిపి యువజన విభాగం నాయకులు కిషన్, వైసిపి నాయకులు కొండయ్య, అశోక్, పెంచలయ్య, పెంచల బాబు, వెంకటేష్, సుమధర్,చంద్ర తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు