

మన న్యూస్, తిరుపతి ఏప్రిల్ 27:– కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ తో పాటు ఆమె అనుచరులు మంగళవారం భారీగా కడప కొత్తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పుష్పావతి యాదవ్ మాట్లాడుతూ మహానాడుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతినిధులతో పాటు భారీగా తరలివస్తున్న జనంతో చూస్తుంటే మరో 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఆనందాన్ని వెళ్ళబుచుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్, వాణిజ్య విభాగం నాయకులు కార్జాలపు బాలాజీ నాయుడు పార్టీ నాయకులు కెవి రమణ, యూనిట్ ఇంచార్జ్ ప్రకాష్ యశోద, వైష్ణవి, నారాయణ విశ్వనాథ్ పాల్గొన్నారు.