నెల్లూరు, మన న్యూస్:– వీపీఆర్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన జిల్లా మహానాడు ఏర్పాట్ల పరిశీలన సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మే 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతోందని చెప్పారు. ఈ మహానాడు ద్వారా పార్టీకి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు, తీర్మానాలు వెలువడనున్నాయని తెలిపారు.వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన ఒకే ఏడాదిలో వ్యవస్థలను గాడిలో పెట్టిందని పేర్కొన్నారు. పాలన మరింత ప్రజోన్ముఖంగా సాగేందుకు మహానాడులో ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావ్యా కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నెల్లూరులో జిల్లా మహానాడు ఎల్లుండి ఘనంగా జరగనుందని నేతలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *