పినపాక, మన న్యూస్ :- ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు. బుధవారం పినపాక కేజీబీవీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం తదితర అంశాలపై ఉపాధ్యాయులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పినపాక, కరకగూడెం మండల విద్యాశాఖ అధికారులు కొమరం నాగయ్య, జి. మంజుల, రెండు మండలాల రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *