

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను గురువారం రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ పరిశీలించారు.వర్షాకాలం దగ్గర పడుతున్నందున గేట్లు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో ఉన్న 48 వరద గేట్లకు ఆయిలింగ్, గ్రీసింగ్ పనులు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. వరద గేట్లకు గ్రీసింగ్ ఆయిల్ చేపట్టాలని ఆయన అన్నారు వర్షాకాలం ప్రారంభం అయ్యేటప్పటికీ గ్రీసింగ్ ఆయిల్ తదితర పనులు చేపట్టాలని ఆయన సూచించారు.
గేట్లు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. అనంతరం వడ్డేపల్లి జక్కాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులను ఆయన పర్యవేక్షించారు.ఆయన వెంట కామారెడ్డి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు,క్వాలిటీ కంట్రోల్ ఎస్సీ భూమారెడ్డి,క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ దత్తాత్తి, బాన్సువాడ ఎస్సీ రాజశేఖర్, నిజాంసాగర్ సర్కిల్ ఈఈ సోలేమన్, ఏఈలు శివప్రసాద్, సాకేత్ తదితరులున్నారు.

