

మన న్యూస్,తిరుపతి :– మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మకు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని ఐలాపురం హోటల్లో సుగుణమ్మ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. సుగుణమ్మకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్లు ఆర్ మునిరామయ్య, బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాలు రజనీకాంత్ నాయుడు, మున్సిపల్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యం, పలువురు టిడిపి నేతలు ఉన్నారు.
