తెలంగాణ సినీ కార్మికులకు పని కల్పించండి:టి ఎఫ్ సి సి చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

Mana News :- నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా,డిస్ట్రిబ్యూటర్ గా, తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా డా. ప్రతాని రామకృష్ణ గౌడకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో, 41 చిత్రాలను నిర్మించి, 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 250 కి పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. మే 18వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో “ఉమెన్స్ కబడ్డీ” అనే ఓ సరికొత్త నూతన చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే “దీక్ష’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని జూన్ నెలలో రిలీజ్ కు రెడీ అవుతోంది. కిరణ్, ఆలేఖ్య రెడ్డి, ఆక్సఖాన్, తులసి హీరో హీరోయిన్స్ గా నిర్మించిన దీక్ష చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఒక్క టికెఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లోనే 15 రోజులు షూటింగ్ జరుపుకుంది. దీక్ష తో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అద్భుతమైన 5 పాటలున్నాయి. రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో మధుప్రియ, గీతామాధురి పాటల్ని పాడారు. 5 అద్భుతమైన ఫైట్స్ మాస్టర్ రవి కంపోజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత డా. ఆర్ కె గౌడ్. కార్మికులకు పని కల్పించండి. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 సంవత్సరాలు పైగా అవుతోంది. రెండు రాష్ట్రాల్లో ఎఫ్ డి సి లు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణా సినీ కార్మికులు పని లేక అష్ట కష్టాలు పడుతూ, వివక్షకు గురవుతూనే వున్నారు. తెలంగాణా ఎఫ్ డి సి, తెలంగాణా ప్రాంత కార్మికులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా ఎంతోమంది ప్రతిభగల అద్భుతమైన టెక్నిషియన్స్ వున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వండి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిల్మ్ చాంబర్స్ అందరూ కలసి 50శాతం పని తెలంగాణా కార్మికులకు, మిగతా 50 శాతం ఇతర ప్రాంతాల కార్మికులకు పని కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ