

మన న్యూస్ చిత్తూరు మే-17
చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని ఆర్ వి ఎస్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల కు చెందిన బి ఫార్మసీ విద్యార్థినికి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందజేశారు. బీఫార్మసీ 2020-24 కు చెందిన పి లిఖిత రెడ్డి అనే విద్యార్థిని అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ 14 స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఛాన్స్లర్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శనివారం బంగారు పథకాన్ని అందుకున్నారు. బంగారు పతకం అందుకున్న విద్యార్థిని లిఖిత రెడ్డిని కళాశాల చైర్మన్ రావూరి వెంకటస్వామి, వైస్ చైర్మన్, రావూరి శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ జ్యోతిశ్వరి మరియు అధ్యాపకులు అభినందించారు.