మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని ఉట్కూర్, మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ సమ్మర్ క్యాంప్ లో ఉన్న విద్యార్థులకు షి టీమ్ పోలీసులు, పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా షీ టీం పోలీసులు చెన్నయ్య మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. అందరూ సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలకు షి టీమ్ పోలీసులు అండగా ఉంటారని మహిళలను, విద్యార్థులను ఎవరైనా వేధించిన, శారీరకంగా మానసికంగా బాధపెట్టిన ధైర్యంగా షి టీమ్ పోలీసులకు నెంబర్. 8712670398 కి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వేధించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒకవేల సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షీ టీం పోలీసులు బాలరాజు, జ్యోతి, కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *