

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5:– రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉండవల్లిలో వారి నివాసంలో భేటీ అయ్యారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కి వివరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మే 15న పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నెల్లూరు రూరల్ లో ప్రారంభిస్తున్నామని తెలియజేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .