

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్:- మా బడి ఉద్యానవనంలో వికసించిన విద్యా కుసుమాలు 5thA చిన్నారులు, వీరంతా పర్యావరణాన్ని కాపాడాలంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా ఉండాలంటూ తరగతి ఉపాధ్యాయని చల్లా ఉమా రాజ మంగతాయారు 5 వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ సందర్భంగా వారిలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే స్పృహను కలిగించే దిశగా ప్రతి విద్యార్థి మొక్కల పెంపకం పట్ల ఆసక్తిని అభిరుచిని పెంపొందించుకోవాలంటూ విద్యార్థులకు మొక్కలను అందిస్తూ అభినందించారు .ఇదే సందర్భంగా మా పాఠశాల లో పదవతరగతి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను అత్యధిక ప్రతిభను కనబరిచి ఉత్తీర్ణతను పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించడం వారి ద్వారా ఫిఫ్త్ క్లాస్ చిన్నారులకు మోటివేషన్ కలిగించుటకు ఉత్తమ ఫలితాల సాధనలో వారు చేసిన కృషిని వివరించారు జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉద్యానవనంలో విద్యను పొందుతున్న బాలికలను మోటివేట్ చేయడం జరిగింది . విద్యార్థుల తల్లిదండ్రులతో ఎస్ఎస్సి ఫలితాలలో ఘన విజయం సాధించిన తోట పుష్పాంజలి ,కనకవల్లి లను భవిష్యత్తు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని వారి భవిష్యత్తును అందంగా మలుచుకోవాలని ఆకాంక్షిస్తూ ఫిఫ్త్ క్లాస్ చిన్నారులను ప్రోత్సహించడం జరిగింది.