

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 23: – ఎన్నికల్లో చేసిన ప్రతి హామి అమలు చేస్తాం. – అతి త్వరలో విడవలూరులో మిని స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాను. – సమాజ సేవపై ఆసక్తి వున్న విద్యావంతులు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయండి. – ధాన్యం విక్రయించిన 24 గంటలలో రైతుల అకౌంట్లలో నగదు జమ కావడం యిదే మొదటి సారి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
సాగునీటి కాలువలలో పూడికలు తీయడం రైతుల పాలిట వరమైందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ఆమె విడవలూరు గ్రామాన్ని సందర్శించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి రోల్ మాడల్ గా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. నేరుగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం కోసమే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటలలో రైతుల ఖాతాలలో డబ్భులు జమ అవ్వడమే కాకుండా హమాలి కూలీలు కూడా ప్రభుత్వం అప్పటికప్పుడే చెల్లించడం యిదే మొదటి సారన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుభిక్షంగా వున్నారన్నారు. ఎమ్మెల్యేలను ప్రజలతో మమేకం చేయడం కోసమే నెలకో సారి పెన్షన్ల పంపిణి, స్వఛ్చ ఆంధ్ర, పబ్లిక్ గ్రీవెన్స్ లాంటి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారన్నారు.
విడవలూరులో మిని స్టేడియం నిర్మాణంతో పాటు డిగ్రీ కళాశాల ప్రహారి నిర్మాణాన్ని కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. విడవలూరులోని ఇందిరమ్మ కాలనీ, కామాక్షి నగర్ ప్రాంతాలను త్వరలోనే పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధిస్తానన్నారు. ఎన్నికలలో చేసిన హామీలను ఒక్కోటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ పరిపాలన చేయడం చంద్రబాబు నాయుడు కే సాధ్యమన్నారు. నిరక్ష్యరాస్యత నిర్మూలనలో ప్రజా ప్రతినిధులు, నాయకులు భాగస్వాములై కోవూరు నియోజకవర్గంలో సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఓ సూర్యకుమారి, ఎంపిపి ఏకుల శేషమ్మ, టిడిపి మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, మార్తురు శ్రీనివాసులు రెడ్డి, పాశం శ్రీహరి రెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, సత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.