

మన న్యూస్ సింగరాయకొండ :- వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేయాలంటూ సింగరాయకొండలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కందుకూరు రోడ్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ముస్లిం మైనారిటీ హక్కులను హరించే విధంగా ఉందని విమర్శించారు. దేశంలోని ముస్లింల ఆస్తుల పరిరక్షణకు, సామాజిక సంక్షేమానికి వక్ఫ్ బోర్డు ఎంతో కీలకమని, దాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను తక్షణమే విరమించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలు ముస్లిం మైనారిటీ సంఘాలు, ప్రజా సంఘాలు, యువత పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.