

ఉదయగిరి మన న్యూస్::: ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి లోని టొబాక బోర్డులో ఈ సందర్భంగా రైతులు తమకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ ఎమ్మెల్యేకి వివరించారు. గతంలో క్వింటా పొగాకు ధర అధికంగా 33వేల రూపాయలు ఉండగా నేడు 28వేల రూపాయలు మాత్రమే ఉందంటూ తెలిపారు.
లో గ్రేడ్ పొగాకు క్వింటా 20వేలు మాత్రమే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గం లో కలిగిరి, వింజమూరు, కొండాపురం, జలదంకి, దుత్తలూరు ఐదు మండలాల్లో సుమారు 1500 మంది రైతులు పొగాకు పంట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
గిట్టుబాటు ధర లేకపోతే నష్టాలు వస్తాయంటూ ఎమ్మెల్యేకి తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పొగాకు బోర్డు ఏఎస్ఓ మురళి పాండేతో ధరల స్థిరీకరణ గురించి మాట్లాడారు.
పొగాకు ధరలు పెంపుదలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లి ధర గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పొగాకు రైతులు పాల్గొన్నారు.