

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం లో ధరూర్ మండలం కేంద్రంలో తెలంగాణ భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , హాజరయ్యారు.మంత్రికి ఎంపీ ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు… గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీ మల్లు రవి , గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. గద్వాల మండలం గోనుపాడు గ్రామం నందు మాజీ సర్పంచి మజీద్, యువ నాయకులు అజయ్ ఆధ్వర్యంలో గద్వాల మండలం నాయకులు కలిసి మంత్రి , ఎంపీ ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. గద్వాల నుండి ధరూర్ మండల కేంద్రం వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాన్వాయి తో సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
