

వెదురుకుప్పం, మన న్యూస్ ఏప్రిల్ 11 : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురుకుప్ప మండలం తిరుమలయ్య పల్లి పంచాయతీలో భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలు మేరకు స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం పార్టీ యొక్క స్థితిగతుల గురించి నాయకులు కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు చర్చించారు. అక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ బోడి రెడ్డి హనుమంత రెడ్డి మండల ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం రెడ్డి రాజేంద్రరెడ్డి సీనియర్ నాయకులు చెంగారెడ్డి,విజయభాస్కర్ రెడ్డి ఎస్టీ మోక్ష మండల అధ్యక్షులు శేఖర్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుప్రతిభ కనపరిచిన విద్యార్థికి పారితోషకం అందిస్తాం : బిజెపి మండల అధ్యక్షులు వెదురుకుప్పం ఏప్రిల్ 11: 2024 – 25వ విద్యాసంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధించిన మండల స్థాయి విద్యార్థినీ విద్యార్థుల్లో ఒకరికి పదివేల రూపాయలు ప్రోత్సాహ నగదును అందించనున్నట్లు వెదురుకుప్పం మండల బిజెపి అధ్యక్షుడు బోడి రెడ్డి అశోక్ రెడ్డి తెలిపారు. ఈ నగదును వెదురుకుప్పం మండల విద్యాశాఖ ద్వారా అందిస్తామని ఆయన తెలియజేశారు.
