

సింగరాయకొండ మన న్యూస్:- మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య, జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, జనసేన మండల అధ్యక్షుడు అయినాబత్తిన రాజేష్, బిజెపి నాయకులు బాలకోటయ్య గారు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.బడుగు, బలహీన, దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే. మూఢనమ్మకాల నిర్మూలన, కులవ్యవస్థపై ఉద్యమం, సమసమాజ నిర్మాణం, సత్యశోధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన, ప్రస్తుత సమాజానికి దిశానిర్దేశకుడిగా నిలుస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.ఈ సందర్భంగా అతిథులు మహాత్మ పూలే సేవలను స్మరించుకొని ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమానత్వ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
