రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – అవి రద్దు, పథకాలు దక్కాలంటే..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటి కే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బోగస్ కార్డుల ఏరివేతకు నిర్ణయించింది. ఇక, కార్డుల జారీతో పాటుగా.. పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికం కావటంతో కొనసాగింపు.. కొత్తవి జారీ పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులు ఈ నెల 31లోపు ఇకెవైసి ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తాజా ఆదేశాలు :- ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ప్రభుత్వం అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావటంతో.. పథకాల లబ్ది దారులు ఈ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో కార్డుల్లో మార్పుల చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు నిరీక్షిస్తున్నారు. అర్హత లేకుండా కార్డులు పొందిన వారివి తెలిగించేలా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తోంది. ఇక, ఇప్పుడు రేషన్ కార్డుల లబ్దిదారులు ఈ కేవైసీ తప్పని సరిగా చేసుకొనేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు సౌరబ్‌గౌర్‌ ఆదేశించారు. ఈ కేవైసీ డెడ్ లైన్ :- ఇకెవైసి యూనిట్లు రేషన్‌ డీలర్లు, తహశీల్దార్లు, డిఎస్‌ఒల లాగిన్‌లలో యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్‌ యాప్‌, రేషన్‌ షాపుల్లోని ఈ పోస్‌ పరిక రాల ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇకెవైసి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో రేషన్‌ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగు తున్నది. ఈకేవైసీ ప్రక్రియతో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్‌ ఏరివేతకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులందరి బయోమెట్రి క్‌ నమోదు చేయడంతో దాదాపుగా కార్డులు ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్‌ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని డీలర్లు అంటున్నారు. పథకాల కోసం :- ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ఈకేవైసీని లబ్ధిదారులు చేయించకుంటే వారి కార్డు రద్దే అవశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఈకేవైసీ జరగని కారణంగా ఆ రేషన్‌కార్డు రద్దు జాబితాలో చేరుతుందని చెబుతున్నారు. దీంతో, రేషన్‌కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయిం చుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు. దాదాపు 30 శాతం కార్డులకు ఇప్పటి కీ ఈ కేవైసీ పూర్తి కాలేదని సమాచారం. దీని కారణంగానే జిల్లా యంత్రాంగానికి తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వచ్చే మే నెల నుంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ముందుగా లబ్ది దారుల ఖరారులో భాగంగా రేషన్ కార్డులను ప్రామాణికం గా భావిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు రేషన్ కార్డుల కొనసాగింపు.. పథకాల లబ్దిదారుల ఎంపికలో ఈ కార్డులు – ఈ కేవైసీ ప్రక్రియ కీలకంగా మారుతోంది.

Related Posts

అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

శంఖవరం మన న్యూస్ (అపురూప్) ; జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పాలనా వికేంద్రీకరణకు గుర్తుగా “మా పంచాయతీ – మా గౌరవం” పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సును గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్…

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామములో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు పేరెంట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగిలిదేవి సత్తిరాజులు హాజరయ్యారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

  • By APUROOP
  • April 24, 2025
  • 2 views
అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

  • By JALAIAH
  • April 24, 2025
  • 6 views
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు