

మనన్యూస్,కలిగిరి:హ్యూమన్ రైట్స్ రాష్ట్రయూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పోరాటం వల్లనే వర్గీకరణ సాధ్యమైందని, ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని 30 సంవత్సరముల తర్వాత మాదిగల చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, మాదిగలు ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు కి రుణపడి ఉంటామని శుక్రవారం ఆయన నివాసం లో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర యూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు తెలిపారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర యూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ… వర్గీకరణ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాలలో వెనకబడిన మాదిగలకు రోస్టర్ విధానంలో ముందు వరుసలో పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వర్గీకరణ విషయం మీద ఒకసారి కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డిని మాదిగ జాతి బిడ్డలు ఎప్పటికి నమ్మవద్దని హితవు పలికారు . అనంతరం మన హ్యూమన్ రైట్స్ రాష్ట్ర యూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు మాట్లాడుతూ వర్గీకరణ చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ జాతి బిడ్డలు ఎస్సీ వర్గీకరణ కోసం ఎందరో ఆత్మార్పణ చేశారని వారందరికీ మాదిగ జాతి రుణపడి ఉంటుందని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా అలుపెరగని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
