

మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 12:నెల్లూరు నగరంలోని కాకాని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు , రాష్ట్ర ఎస్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు , శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య , నెల్లూరు రూరల్ ఇంచార్జీ ఆనం విజయకుమార్ రెడ్డి , జిల్లా ఎస్సీ సెల్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి .ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ……..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్రమంతా సూపర్ సక్సెస్ అయ్యింది అని అన్నారు.చంద్రబాబు సూపర్ సిక్స్ సభ ఫ్లాప్ కావడంతో జగన్మోహన్ రెడ్డి పై టిడిపి నాయకులు విమర్శలు చేయడం హేయమైన చర్య అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు, చంద్రబాబు టీమ్ మాటల దాడికి దిగుతున్నారు- క్షేత్రస్థాయిలో తిరిగే ధైర్యం లేక, రైతులు తిరుగుబాటు చేస్తారన్న భయం కూటమినేతల్లో ఉంది అని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ రూములలో కూర్చోని మీడియా సమావేశాలు నిర్వహించడం కాదు, క్షేత్ర స్థాయిలో తిరిగి రైతులు యూరియా కోసం పడుతున్న బాధలు చూడాలి అని అన్నారు.రాష్ట్రంలో రైతులు, రైతు సంఘాల నేతలు యూరియా దొరకడం లేదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందడం లేదని వాపోతున్నారు అని అన్నారు.50 శాతం కంటే ఎక్కువ యూరియా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల కొరత ఏర్పడిందని బ్లాక్ మార్కెట్కు వెళ్ళిందని మీడియా సాక్షిగా చేసిన తప్పును ఒప్పుకున్నా అచ్చన్నాయుడు నేడు సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కోట్ల రూపాయలు వెచ్చించి, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బంది నియమించి, గ్రామ పరిధి దాటి వెళ్లకుండా యూరియాను సమృద్ధిగా అందించారు అని అన్నారు.నేడు మొక్కుబడిగా యూరియా పంపిణీ చేసి మమా! అనడం చూస్తే, రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది అని అన్నారు.చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, రైతులు ఇబ్బందులు పడాల్సిందే!, రోడెక్కాల్సిందే!, ఆత్మహత్యలకు పాల్పడే దుర్భర పరిస్థితులు ఏర్పడుతాయి అని అన్నారు.చంద్రబాబు లక్షల టన్నుల యూరియా తెస్తే రైతులకు అందకుండా, ఎక్కడికి దారి మళ్లిందో సమాధానం చెప్పాలి! అని అన్నారు. రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ కు వెళ్లడంతో 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా, 600/-, 700/- రూపాయలు పెట్టినా, రైతులకు దొరకని పరిస్థితి ఏర్పడిందని బాహటంగా మాట్లాడుతున్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వంలో పత్తి, మిర్చి, మామిడి, పొగాకు, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేక కంటికి కడిపడి ఏడుస్తున్నారు అని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పుట్టి (850 కేజీలు) ధాన్యం 25 వేలకు అమ్ముకుంటే, నేడు రైతుల ధాన్యాన్ని 13వేలకు కూడా కొనేవారు లేరు అని చెప్పను అని అన్నారు .రైతులు ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపోతున్నారు అని అన్నారు.నెల్లూరు జిల్లాలో ధాన్యం దిగుబడికి వచ్చి 14 రోజులు గడుస్తున్నా ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడంతో, రైతుల నష్టపోతున్నారు అని అన్నారు.పంట పండించేందుకు యూరియా దొరకక ఇబ్బందులు పడుతూ, మరోపక్క పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక బోరుమని విలపిస్తున్న రైతాంగం అని అన్నారు.రైతుల గోడు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అచ్చన్నాయుడుకు మాట్లాడే అర్హత ఉందా! అని అన్నారు. నాసిరకమైన యంత్రాల సరఫరా కోసం ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ ను మధ్యవర్తిగా చేసుకోని, కమీషన్లు మాట్లాడటానికి ప్రయత్నిస్తే, అధికారి నిరాకరించడంతో బదిలీ చేశారని ఆ అధికారి మాట్లాడిన మాటలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ఏం సమాధానం చెబుతాడు! అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఉంటే మాట్లాడండి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ని విమర్శించడం ఆకాశం పై ఉమ్మి వేస్తే మీ మీదే పడుతుందని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలి అని అన్నారు. తిండి కోసం బఫెలో నిలబడినప్పుడు లేని తప్పు, రైతులు యూరియా కోసం క్యూలో నిలబడలేరా అంటూ అన్నం పెట్టే అన్నదాతల గురించి అవహేళనగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు అని అన్నారు.రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రైతుల నడ్డి వీరుగుతుంటే, రైతులు బోరున విలపిస్తుంటే, రైతులను ఆదుకోకుండా, రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరికాదు అని అన్నారు.కూటమి ప్రభుత్వం పోలీసులను పెట్టి అణగ వేయాలని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన అండగా నిలబడి పోరాటం చేస్తాం అని అన్నారు.
