

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామములో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది…
శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం లో సాయంత్ర సమయంలో రామలింగేశ్వర స్వామి వారిపై సూర్య కిరణాలు ప్రసరించి పసిడి రంగు వెలుగులతో దర్శనం ఇచ్చారు.ఆలయ రాజ గోపురం, ముఖమండపం, నందీశ్వర అంతర ఆలయం,దాటి గర్భాలయంలో స్వామి వారిపై కిరణాలు పడటం విశేషం… ఈ సమయంలో ఆలయ అర్చకులు వీరబాబు, దత్తు సోదరులు.. స్మార్త విద్యార్థుల పండిత బృందంతో మహాసౌరం పారాయణ చేయడం తో భక్తులు ఈ దృశ్యాలు చూసి తన్మయత్వం చెందారు.. ఆలయ సేవా సభ్యులు మాట్లాడుతూ.. సంవత్సరానికి రెండు సార్లు… ఉత్తరాయణం లో ఒకసారి, దక్షిణాయనము లో ఒకసారి సూర్యకిరణాలు స్వామివారిపై పడతాయని తెలియజేశారు.
