

కావలి,మన న్యూస్, మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి లో కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి అసువులు బాసిన మహానియుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు,ఆర్యవైశ్య నేతలు,కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి అలయకమిటి చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి,ఒరుగంటి రామకృష్ణ,అమర సుబ్బారావు ,అమర వేదగిరి గుప్తా, తిరివీధి ప్రసాద్,చక్రి,వేముల సునీల్ ,గాధంశెట్టి మధుసూదన్,సునీల్, వైభవ్ సురేష్, మొగళ్ల పల్లి రాజా,చక్రి,ఒరుగంటి సురేష్,వేమా రమేష్, తదితరులు పాల్గొన్నారు.
