మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హీరోయిన్ శ్రీలీల‌ను స‌త్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

Mana News :- ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన మ‌హిళ‌ల‌కు అలాగే ఇత‌ర మ‌హిళామ‌ణుల‌కు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘విశ్వంభ‌ర‌’ సినిమా ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అదే స్టూడియోలో మ‌రో షూటింగ్‌లో ఉన్న శ్రీలీల‌కు ఈ విష‌యం తెలిసి త‌నెంత‌గానో అభిమానించే చిరంజీవి స‌మీపంలో ఉన్నార‌ని తెలుసుకున్న శ్రీలీల‌ విశ్వంభ‌ర సెట్స్‌కు వెళ్లి చిరంజీవి ని క‌లిశారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన శ్రీలీల‌కు శాలువా క‌ప్పి స‌త్క‌రించిన దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బ‌హుమ‌తిగా బ‌హుక‌రించారు మెగా స్టార్ చిరంజీవి .మెగాస్టార్ నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తిని అందుకున్న‌ శ్రీలీల సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!