Mana News :- తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో స్టార్ హోరీవం రేంజ్ కి ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి కోటి రూపాయలు పారితోషకం అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా నిలిచారు. సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది విజయశాంతి. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. #NKR21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూవీ మేకర్స్ ‘అర్జున్ S/O వైజయంతి’ గా రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో.. ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది” అని పేర్కొన్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయశాంతి చేతిలో గన్ పట్టుకొని ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా.. కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ అండ్ మాస్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *